పుస్త‌కాల్లో క‌నిపించ‌ని అహోం సామ్రాజ్యం గురించి విశేషాలు మీకోసం...!

భారత దేశ చ‌రిత్ర‌లో నే ఓ గొప్ప సామ్రాజ్యం ఇది ! పుస్త‌కాల్లో క‌నిపించ‌ని అహోం సామ్రాజ్యం గురించి విశేషాలు మీ కోసం...!



మ‌న భారత దేశంలో అనేక మంది రాజులు పూర్వం ప‌లు ప్రాంతాల‌ను పాలించారు. గుప్తులు, మౌర్యులు, చోళులు, విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యం రాజులు, శాత‌వాహ‌నులు,పాండ్యులు, క‌ళింగులు.. ఇలా ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాల‌ను ఏక ‌ఛ‌త్రాధిప‌త్యంగా పాలించారు. అయితే అంద‌రికీ గుర్తింపు వ‌చ్చింది. కానీ మ‌న దేశంలో ఒక‌ టైన అస్సాం ను ఒక‌ప్పుడు పాలించిన అహోం సామ్రాజ్యం రాజుల గురించి చాలా మందికి తెలియ‌దు.

అహోం సామ్రాజ్యం కాలం 1228 నుంచి 1826 వ‌ర‌కు కొన‌సాగింది, త‌రువాత బ‌ర్మావారు ఈ సామ్రాజ్యం పై దాడి చేసి ఆక్ర‌మించుకున్నారు. అనంత‌రం బ్రిటిష్వారి రాక‌ తో ఈ ప్రాంతం కూడా వారి పాల‌న‌లోకి వెళ్లింది. నిజానికి పైన తెలిపిన ఇత‌ర సామ్రాజ్యాల‌లా అహోం సామ్రాజ్యం కూడా గొప్ప‌దే. కానీ దీని గురించి చాలా మందికి తెలియ‌దు. దీనికి 600ఏళ్ల చ‌రిత్ర ఉంది. అన్నేళ్లపాటు ఈసామ్రాజ్యం తిరుగు లేకుండా కొన‌సాగింది. ఎంతో మంది రాజులు అహోం రాజుల‌ పై దండెత్తి యుద్ధాలు చేశారు. కానీ అహోం ఎదుట నిల‌బ‌డ‌లేక ‌పోయారు.

ఒక‌ప్పుడు మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు అత్యాధునిక ఆయుధాలు, భారీ సైన్యం ఉండి కూడా అహోం సామ్రాజ్యం పై 17 సార్లు దండెత్తి యుద్ధం చేసి ఓడిపోయారు. అంత‌టి ఘ‌న చ‌రిత్ర అహోం సామ్రాజ్యం కు ఉంది. అహోంపై చివ‌రిసారిగా రామ్ సింగ్ చ‌క్ర‌వ‌ర్తి భారీ సైనిక బ‌ల‌గంతో దండెత్తి యుద్ధం చేశాడు. అయితే అంత‌టి భారీ సైనిక సంప‌త్తి ఉన్న‌ప్ప‌టికీ రామ్ సింగ్ ఓడిపోయి అక్క‌డి నుంచి బెంగాల్‌ కు పారిపోయాడు.

అహోం సామ్రాజ్యాన్ని ఒక‌ప్పుడు ల‌క్‌చిత్బొర్ఫుక‌న్ అనే యోధుడు పాలించాడు. అహోం సామ్రాజ్యం చ‌రిత్ర‌లో నే ఇత‌ను గొప్ప ప‌రాక్ర‌మాలు క‌లిగిన వాడిగా పేరుగాంచాడు. ఇక అప్ప‌ట్లో అహోం సామ్రాజ్యం చాలా శ‌క్తివంతం గా ఉండేది. ఆర్థికం గా, సైన్యం ప‌రం గా అన్ని రంగాల్లో నూ దృఢం గా ఉండేది. అందుక‌ నే ఆ రాజ్యం పై ఎవ‌రు దండెత్తి నా ఓడిపోయేవారు. అయితే బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని పాలించినా ఇప్ప‌టికీ అస్సాం వారు అహోం సంస్కృతి సంప్ర‌దాయాల‌ను పాటిస్తూనే ఉన్నారు. వారు అప్ప‌టి త‌మ పూర్వీకుల ఆచార వ్య‌వ‌హారాల‌ను మ‌రువ‌లేదు.

భార‌త‌దేశంలో ఎన్నో సామ్రాజ్యాల చ‌రిత్ర‌ల‌ను చాలా మంది చ‌దువుకున్నారు. కానీ అహోం సామ్రాజ్యం చ‌రిత్ర ఎక్క‌డా ఎవ‌రూ చ‌ద‌వ‌లేదు. అంత‌టి గొప్ప సామ్రాజ్యానికి చ‌రిత్ర‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డం బాధాక‌రం. అయితే నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో పాస్ అయ్యే ఉత్త‌మ అభ్య‌ర్థుల ‌కు ల‌క్‌చిత్ బొర్ఫుక‌న్ మెడ‌ల్‌ను అంద‌జేస్తారు. ఆ సామ్రాజ్యాని కి చెందిన ఆ వీరుడి ని గుర్తు చేసుకుంటూ ఆ మెడ‌ల్ ‌ను అంద‌జేస్తారు...

జై శ్రీరామ్

జై హిందుస్తాన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి