క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు? funny conversation with స్వామి చిన్మయానంద

 


పరదేశీయుడు : స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?
చిన్మయానంద స్వామి : జీసస్

పరదేశీయుడు: ఇస్లాం స్థాపకుడు ఎవరు?

చిన్మయానంద స్వామి: మహమ్మద్

పరదేశీయుడు : హిందూ మత స్థాపకులు ఎవరు?

చిన్మయానంద స్వామి : సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.

పరదేశీయుడు: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?

చిన్మయానంద స్వామి: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం., ఎందుకంటే ఇది వ్యక్తుల నుండి వచ్చిన జ్ఙ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను. సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ స్థాపకులు ఎవరు, జువాలజీ స్థాపకులు ఎవరు? దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా? వుండదు. అలాగునే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.

పరదేశీయుడు: అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.

చిన్మయానంద స్వామి: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు… అనంతం…

హిందూ ధర్మం సనాతనమైనది.
హిందత్వం ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి