* మంగళ సూత్రం లో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది , ఎందుకు?
ముత్యం చంద్రగ్రహాని కి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందముల కు అన్యోన్యదాంపత్యముల కు కారకుడు, శారీరకం గా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు ,స్త్రీల గుహ్యావయము లు, నరము లు, ఇంద్రియము లు, గర్భదారణ, ప్రసవముల కు కారకుడు.
కుజ గ్రహ కారకత్వము (పగడం) : అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్య ము, రోగ ము, ఋణపీడ లు, అగ్ని,విద్యుత్భయము లు, పరదూషణ, కామవాంఛ లు, ధీర్ఘసౌమాంగల్య ము, దృష్టి దోష ము యిత్యాదు లు మరియు శారీకం గా ఉదర ము,రక్తస్రావ ము, గర్భస్రావ ము,ఋతుదోషము లు మొ!! ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దా ము.
ఖగోళం లో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాల లో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజునకుజుని తో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమై న స్త్రీకి 28 వ రోజుల కు ఋతుదర్శనమవాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీల కు మంగళసూత్రము లో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడుజాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటం లో విశేష గూడార్ధమున్నది, అదేమిటో చూద్దామా!
ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీల లో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీల లో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.
ముత్యం, పగడం సూర్యు ని నుండి వచ్చే కిరణాల లో నుండే ఎరుపు(కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలో ని అన్ని నాడీకేంద్రముల ను ఉత్తేజపరచి శరీరకం గా, భౌతికం గా ఆ జంటగ్రహాలు స్త్రీల లో వచ్చే నష్టాల ను, దోషాల ను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు .కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూ కూడా కలిపిన మంగళ సూత్రం స్త్రీ కి అత్యంత శుభ పలితాలు సమకూర్చగలవు.
మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారికజీవితాన్ని నడిపేవాడుకుజుడేనన్న మాటమరువకూడదు, అందుకే తొలుత గా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
ప్రతి స్త్రీ జీవితం లో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి